Telugu Global
WOMEN

సమ్మర్‌‌లో గర్భిణులకు ఎదురయ్యే సమస్యలివే..

సమ్మర్‌‌లో తల్లికి ఎదురయ్యే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ప్రెగ్నెంట్ విమెన్ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

సమ్మర్‌‌లో గర్భిణులకు ఎదురయ్యే సమస్యలివే..
X

రకరకాల అనారోగ్య సమస్యలను తీసుకొచ్చే సమ్మర్ సీజన్‌లో గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సమ్మర్‌‌లో తల్లికి ఎదురయ్యే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ప్రెగ్నెంట్ విమెన్ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

సమ్మర్‌‌లో గర్భణీ స్త్రీలకు తలనొప్పి, వేడి, డీహైడ్రేషన్ వంటి సమస్యలొస్తుంటాయి. అలాగే ఈ సీజన్‌లో గర్భీణుల తరచూ నీరసించిపోతుంటారు. వీటికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

సమ్మర్ సీజన్‌లో గర్భిణుల్లో ఎండకు ఎక్స్‌పోజ్ అవ్వకుండా జాగ్రత్తపడాలి. ‘డి’ విటమిన్ కోసం ఉదయం లేదా సాయంత్రపు వేళల్లో మాత్రమే బయటకు వస్తే సరిపోతుంది. గర్భిణులు ఎండ వేడి కారణంగా త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి రోజుకి నాలుగు లీటర్ల నీటితోపాటు కొబ్బరి నీళ్లు, కర్భూజా, పుచ్చకాయల వంటివి కూడా తరచూ తింటుండాలి.

సమ్మర్‌‌లో సాధారణంగా శరీరంలోని వేడి పెరుగుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో గర్భిణులు నూనె పదార్థాలకు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మసాలాలు, నాన్ వెజ్ ఫుడ్స్ తగ్గించి పండ్లు, కాయగూరలకు ఎక్కువ ప్రధాన్యం ఇవ్వాలి.

సమ్మర్‌‌లో వేడి కారణంగా తలనొప్పి, అలసట వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అలాంటి వాళ్లు వీలైనంత వరకూ రెస్ట్ తీసుకోవాలి. టీ, కాఫీలు తగ్గించాలి. మనసుకి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. తగినంత నిద్రపోవాలి.

సమ్మర్‌‌లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గర్భిణులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతే వడ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ బాటిల్ లేదా నిమ్మరసం వంటివి వెంట తీసుకెళ్లాలి. వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. ఎండ తగలకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

సమ్మర్ సీజన్‌లో హెల్దీగా ఉండేందుకు గర్భిణులు ఆహారంలో విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఐరన్, కాల్షియం, విటమిన్ల కోసం పండ్లు, నట్స్ వంటివి కూడా తీసుకుంటుండాలి.

వేసవి కాలంలో వచ్చే సమస్యలను నెగ్లెక్ట్ చేయకుండా గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సమయానికి డాక్టర్ చెకప్, మందులు వాడడం లాంటివి మర్చిపోకూడదు.

First Published:  17 April 2024 4:02 AM GMT
Next Story