జులై 2, 3 తేదీల్లో తూర్పు, విశాఖ‌ల్లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

 వాయుగుండం, రోడ్డు ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు ప‌రామ‌ర్శించేందుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 2, 3 తేదీల్లో తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించ‌నున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలుత రాజమండ్రికి చేరుకుని అక్క‌డి నుంచి రంప‌చోడ‌వ‌రం నియోజ‌కవ‌ర్గంలోని సూరంపాలెం వెళ్తారు. ఏజెన్సీలో ఇటీవల జరిగిన వ్యాన్ ప్రమాద బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం కాకినాడకు వెళ్లి మత్స్యకార కుటుంబాలను కలుస్తారు. రాత్రి కాకినాడ‌లో బ‌స చేసి 3వ తేదీ ఉద‌యం తుని నియోజ‌క‌వ‌ర్గం లోని పెరుమాళ్ల‌పురం వెళ్తారు. బాధిత మ‌త్స‌కారుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. అక్క‌డి నుంచి వైఎస్ జగన్ విశాఖపట్నం జిల్లా య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గంలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఇటీవల ధవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించినవారి కుటుంబసభ్యులను అచ్యుతాపురంలో వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here