ఈ విషయంలోనైనా మెచ్చుకో జగన్ – పుట్టిన రోజునాడైనా నిజాలు చెప్పు అచ్చెన్నా

ఏపీ విద్యుత్ కొనుగోలు అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. రెండేళ్ల కాలంలో ఏపీలో కోతలు లేకుండా చేసిన ఘనత తమకే దక్కుతుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే కోతలు లేని విద్యుత్ పేరు చెప్పి ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిందని జగన్ ఆరోపించారు. బహిరంగ మార్కెట్ యూనిట్ విద్యుత్ పగలు రూ. 2. 70, రాత్రి రూ. 1.70లకే దొరుకుతుంటే ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ సంస్థల వద్ద యూనిట్ రూ. 5.11లకు కొంటోందని జగన్ ఎత్తిచూపారు. ఇలా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడంపై ఇండియన్ పవర్  ఎనర్జీ ఎక్సైంజ్ సంస్థ తప్పుపడుతూ అనేక సార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.

 ప్రైవేట్ సంస్థల నుంచి వచ్చే లంచాల కోసమే చంద్రబాబు ఇలా అధిక ధరకు విద్యుత్ కొంటున్నారని జగన్ ఆరోపించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అచ్చెన్నాయుడు … జగన్‌ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో ఇంతకంటే ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని చెప్పారు. కోతలు లేని కరెంట్‌ సరఫరా చేస్తున్నామని… కనీసం ఈ విషయంలోనైనా ప్రభుత్వాన్ని జగన్ మొచ్చుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు. తిరిగి మాట్లాడిన జగన్‌.. పుట్టిన రోజునాడైనా కనీసం అచ్చెన్నాయుడు నిజాలు మాట్లాడాలని కోరారు. పుట్టిన రోజు నాడు కూడా అబద్ధాలు చెబితే ఇంకేం చేయాలన్నారు. జగన్ వ్యాఖ్యలతో అచ్చెన్నాయుడుతోపాటు మిగిలిన సభ్యులంతా నవ్వారు.

కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా తాము అవిశ్వాసం తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిన వ్యక్తి చంద్రబాబు అని జగన్ విమర్శించారు.  చంద్రబాబు హయాంలో 9సార్లు కరెంట్ చార్జీలు పెంచారని గుర్తు చేశారు. చార్జీలు పెంచవద్దని కోరినందుకు బషీర్‌బాగ్‌లో జనాన్ని పిట్టలను కాల్చినట్టు కాల్పించిన  ఘనత చంద్రబాబుదేనన్నారు. జగన్‌ వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వశ్రీనివాస్‌, మంత్రి కామినేని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Click on Image to Read:

jc-diwakar-jagan-chandrababu

jagapathi

ysrcp

jc-raghuveera

ysrcp-tdp

jagan1

kotla

jagan-koneru

jagan1

sunny

ysrcp-tdp

mla-vishnu

traffic-police

chiru-chandrababu

Somireddy-Chandramohan-Redd

roja 143

ys-jagan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here