స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి రిలీజ్ వాయిదా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లుఅర్జున్ న‌టించిన స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి సినిమాను ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. అయితే ఫ్యామిలీ ప్లానింగ్‌లో బిడ్డ‌కు బిడ్డ‌కు మ‌ధ్య ఎడం వుండేలా ప్లాన్ చేసిన‌ట్లు మెగాస్తార్ చిరంజీవి ఫ్యామిలీ మెంబ‌ర్స్ సినిమాల‌మ‌ధ్య గ్యాప్ వుండాల‌ని అనుకుంటున్నారు.
మార్చి 27న సాయిధ‌ర‌మ్‌తేజ్ సినిమా రాజ్ విడుద‌ల అవుతుంది. దానితో అల్లుఅర్జున్ సినిమా స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తిని ఏప్రిల్ 9న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
ఏప్రిల్ 8న బ‌న్ని బ‌ర్త్‌డే కావ‌డంతో ఇంత‌క‌న్నా మంచి రిలీజ్ రోజు లేద‌ని నిర్మాత‌లు బావిస్తున్నార‌ట‌.