గబ్బర్ సింగ్ కి అడ్డేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఎంత సూపర్‌ హిట్టో తెలుగు ప్రేక్షకులంద‌రికీ తెలిసిందే… ఇప్పడు పవన్‌ కళ్యాణ్‌ దాని సీక్వెల్ తీద్దామనుకుంటే టైటిల్‌ అడ్డు వస్తోంది. ఎందుకంటే షోలే సినిమాలోని విలన్‌ పాత్ర పేరు గబ్బర్ సింగ్ అని అందరికి గుర్తుండే వుంటుంది. ఆ సినిమా, కథా, అందులోని పాత్రల పేర్లు అన్నిటికి సిప్పీ కుటుంబానికి కాపీ రైట్స్ ఉన్నాయి.గత సారి టైటిల్ పెట్టినందుకు నిర్మాత బండ్ల గణేష్ నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసారు షోలే నిర్మాతలు.ఇప్పడు పవన్‌కళ్యాణ్‌ గబ్బర్-2 సినిమా తియ్యాలనుకుంటే టైటిల్ గుడ్‌విల్‌కి 3 నుండి 4 కోట్ల దాకా కట్టాలంట. అందుకే పవన్‌ కళ్యాణ్‌ గబ్బర్ సింగ్ -2 బదులు సర్దార్ అని పేరు మారుద్దామ‌నుకుంటున్నాడ‌ట‌.