30 నుంచి సైనిక స్కూలు ఇంటర్వ్యూలు

విజయనగరం: కోరుకొండ సైనిక పాఠశాలలో 6, 9 తరగతుల్లో ప్రవేశానికి ఈ నెల 30 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌, గ్రూప్‌ కెప్టెన్‌ పి.రవికుమార్‌ విజయనగంలో తెలిపారు. గత నెల 22న నిర్వహించిన ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఇప్పటికే ఇంటర్య్వూ కాల్‌ లెటర్లను తపాలా ద్వారా పంపామన్నారు. ఈ నెల 27లోగా కాల్‌లెటర్స్‌ అందని విద్యార్థులు పాఠశాల ఫోన్‌ నెంబరు 08922-246168ను సంప్రందించాలని ఆయన కోరారు.