జర నవ్వండి ప్లీజ్ 17

ప్రశ్న
ప్రకాష్‌ : మా స్కూల్‌ టీచర్‌ ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ వుంటుంది ఎందుకని? వికాస్‌ : బహుశా ఆమెకు ఆన్సర్స్‌ తెలీవేమో!
************
సున్నా
స్టూడెంట్‌: మేడం! నాకు జీరో మార్కులిచ్చారు నేను మరీ అంత చెత్తగా రాశానా?
టీచర్‌ : ఏంచెయ్యమంటావు? అంతకుమించి తక్కువ ఇచ్చే వీల్లేదు
************
టానిక్‌
తండ్రి : నువ్వీరోజు టానిక్‌ తాగావా?
కొడుకు : లేదు
తండ్రి : ఎందుకని?
కొడుకు : మీరేకదా! లాఫర్‌ ఈజ్‌ ద బెస్ట్‌టానిక్‌ అన్నారు.. అందుకని నవ్వి వూరుకున్నా!
************
గురక
పేషెంట్‌ : నాకెంత గురక వస్తుందంటే దాని వల్ల నిద్రపోలేకపోతున్నాను
డాక్టర్‌ : ఐతే వెళ్లి యింకో గదిలో పడుకోవచ్చు కదా!