రిటైర్మెంట్ ఆలోచనలో రజనీకాంత్

కొచ్చాడియాన్, లింగా సినిమాల ఘోర పరాజయంతో రజనీకాంత్ పునరాలోచనలో పడ్డాడట. ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం మాట అటుంచి, బయ్యర్స్ అందరు రజనీకాంతే తమ నష్టాన్ని భర్తీ చేయ్యాలని వీధుల్లోకి రావడంతో ఇప్పుడు సినిమాలు చేయడం అవసరమా అని రజనీ ఆలోచిస్తున్నాడట. దానికి తోడు ట్రెండ్ మారిందని, ఇదవరకటి జిమ్మిక్స్ ఇక పనికిరావని కూడా రజనీ భావిస్తున్నాడట. అలాగని క్యారెక్టర్స్ చేసే ఉద్దేశం మాత్రం లేదట.