జర నవ్వండి ప్లీజ్ 20

కిటికీలు
బిల్‌గేట్స్‌ ఎందుకంత ధనవంతుడయ్యాడు?
‘కిటికీలు”(విండోస్‌) అమ్మడం వల్ల
************
ఆదర్శం
క్లర్కు: సార్‌! మీరొక్కరే పిల్లలకు పాఠం చెబుతున్నారు. తక్కిన టీచర్లు ఏరీ?
టీచర్‌: వాళ్లు బెస్ట్‌ టీచర్‌ అవార్డు కోసం పైరవీలు చెయ్యడానికి వెళ్లారు.
************
చిన్న గీత – పెద్ద గీత
మొదటి వ్యక్తి: నేనీ నగరానికి చెప్పుల్లేకుండా వచ్చాను
రెండో వ్యక్తి: నేను బట్టలే లేకుండా వచ్చాను
మొదటి వ్యక్తి: అదెలా?
రెండో వ్యక్తి: నేను పుట్టింది ఇక్కడే!
************
దొరుకుతుందని..
తండ్రి: మా వాడు తాళంచెవి మింగి మూడు రోజులయింది
డాక్టర్‌: మూడు రోజులు ఎందుకు వూరుకున్నారు?
తండ్రి: వాడు మింగింది డూప్లికేట్‌కీ. అర్జంట్‌ కాదు కదా! బయటకు రాకపోతుందా! అనవసరంగా మీకు ఫీజు ఎందుకని రాలేదు