ఘోర రోడ్డు ప్ర‌మాదం… 9 మంది దుర్మ‌ర‌ణం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై నుంచి కేరళ వెళ్తున్న పాల ట్యాంకర్, ప్రయాణికులతో వెళ్తున్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మధురై ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దిండిగల్ జిల్లా సిద్దయన్ కోట గ్రామ శివారులోని వత్తలగుండు రోడ్డు వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. వ్యానులో రెండు కుటుంబాల వారు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే, వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పాల ట్యాంకర్లోని పాలు, దుర్ఘటనలో మరణించిన వారి రక్తం కలసిపోయి అక్క‌డ  హృద‌య విదార‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.-పీఆర్‌