భూ సేక‌ర‌ణ ఆర్డినెన్స్‌పై రాష్ట్రప‌తి సంత‌కం

ఎన్డీయే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న భూ సేక‌ర‌ణ ఆర్డినెన్స్‌పై రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సంత‌కం చేశారు. గ‌త వారం చివ‌రిలో దీన్ని దాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. నెగ్గ‌కుండా బ‌య‌ట‌కి వ‌చ్చేసింది. దాంతో ఇపుడు ఇది ఆర్డినెన్స్ రూపం సంత‌రించుకుంది. భూ సేక‌ర‌ణ ఆర్డినెన్స్‌పై సంత‌కం చేసిన‌ట్టు రాష్ట్రప‌తి కార్యాల‌యం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రాగానే దీన్ని మ‌ళ్ళీ రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టాల‌ని ఎన్డీయే ప్ర‌భుత్వం ఆలోచిస్తుంది. దీన్ని కాంగ్రెస్ వ్య‌తిరేకించ‌డ‌మే కాకుండా మిగ‌తా ప‌క్షాల నుంచి కూడా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ భూ సేక‌ర‌ణ చ‌ట్టాన్పి ఎన్నిసార్లు పార్ల‌‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టినా తాము వ్య‌తిరేకించి తీరుతామ‌ని విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించిన కాంగ్రెస్ ఇపుడు ఏం చేస్తుందో చూడాలి.-పీఆర్