స్మృతి ఇరానీకి సీసీ కెమెరా షాక్‌!

కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి అనుకోని షాక్ త‌గిలింది. గోవాలో ఆమె ఓ ఎగ్జిబిష‌న్‌కు వెళ్ళారు. అక్క‌డ కొన్ని డ్రెస్‌లు తీసుకుందామ‌నుకున్న ఆమె… తీసుకున్న బ‌ట్ట‌లు వేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ బ‌ట్ట‌లు మార్చుకునే ప్ర‌య‌త్నంలో ట్రైల్ రూంలోకి వెళ్ళారు. అక్క‌డ ఓ సీసీ కెమెరా ఉన్న‌ట్టు గ‌మ‌నించి కంగారు ప‌డ్డారు… వెంట‌నే షాక్ తిన్నారు. గోవాలోని ప్యాబ్ ఇండియా నిర్వ‌హిస్తున్న ఎగ్జిబిష‌న్‌లోని ఓ షో రూంలో ఆమెకు ఈ అనుభ‌వం ఎదురైంది. వెంట‌నే నిర్వాహ‌కుల‌ను నిల‌దీశారు. వాళ్ళు నీళ్ళు న‌మిలారు. మంత్రి వెంట‌నే స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.-పీఆర్‌