8 నుంచి కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సమావేశాలు : స్పీకర్‌ కోడెల

విశాఖ: ఈ నెల 8 నుంచి 10 వతేదీ వరకు మూడు రోజులపాటు కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చెప్పారు. విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో జిల్లా అధికారులతో స్పీకర్‌ కోడెల ఈ సమావేశాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఇందులో పది దేశాల నుంచి ప్రతినిధులు, 20 రాష్ట్రాల నుంచి స్పీకర్లు హాజరవుతున్నారని స్పీకర్‌ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న ఈ సమావేశాల్లో చట్టసభలు, మీడియా అంశాలపై చర్చిస్తామని స్పీకర్‌ కోడెల వివరించారు.-పీఆర్‌