వెంకయ్య మాట నాకు వేదం!

‘నాకసలు పార్ల మెంట్‌ అంటే ఏమిటో తెలియదు. హ‌స్తినే నాకు కొత్త. కానీ వెంకయ్యనాయుడుజీ ఉండడం వల్ల ఏ సమస్యా రావ‌డం లేదు. ఆయన ఏం చెబితే నేను అదే వింటాను’ అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలనుద్దేశించి శనివారం మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యపై పొగడ్తల జల్లు కురిపించారు. మూడు సందర్భాల్లో ఆయన పేరును ప్రస్తావించారు. పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా ఆయన వెంకయ్య పేరును ప్రస్తావించారు. కాగా తన మంత్రివర్గంలో సమర్థులైన నేతలున్నారని, వారిలో.. పార్టీ అధ్యక్షునిగా కూడా పని చేసిన వెంకయ్య ఉండడం తన అదృష్టం అని వ్యాఖ్యానించారు. అద్వానీ, వెంకయ్య వంటి పార్టీ అధ్యక్ష పదవుల్లో ఉన్న వారి మార్గదర్శకత్వం తనకు లభించడం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు.-పీఆర్‌