ప్రభాస్ ఖాతాలోకి చేరిన ఐటెంభామ

ఇప్పటికే అనుష్క, త్రిష, కాజల్ లాంటి హీరోయిన్లు ప్రభాస్ ఖాతాలోకి చేరిపోయారు. ఖాతాలో చేరిపోవడం అంటే కేవలం వీళ్లు ప్రభాస్ తో సినిమాలు మాత్రమే తీశారని కాదు.. ఈ ముద్దుగుమ్మలంతా యంగ్ రెబల్ స్టార్ కు అభిమానులుగా ఎప్పుడో మారిపోయారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఓ ఐటెంభామ కూడా చేరిపోయింది. ఆమె పేరు స్కార్లెట్ జోహెన్సన్.

తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ ఐటెంస్టార్ గా పేరుతెచ్చుకున్న స్కార్లెట్, బాహుబలి సినిమాలో కూడా నటించింది. ప్రభాస్ తో కలిసి ఓ పాటలో చిందేసింది. అక్కడే తొలిసారిగా ప్రభాస్ తో పరిచయం అయింది స్కార్లెట్ కి.అంతే.. పరిచయమైన 10 నిమిషాలకే ప్రభాస్ కు తను వీర ఫ్యాన్ అయిపోయానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ అంత డీసెంట్ హీరోని ఎక్కడా చూడలేదంటోంది ఈ విదేశీ ముద్దుగుమ్మ. నిజానికి ప్రభాస్ చాలా డీసెంట్. మిస్టర్ పర్ ఫెక్ట్ కూడా. అందరితో చాలా మర్యాదగా ఉంటాడు. తను ఒక స్టార్ హీరో అనే ఇగోను ఎక్కడా చూపించడు. అదే ప్రభాస్ కు అందర్నీ దగ్గరయ్యేలా చేస్తోంది.