స‌త్య‌మూర్తికి ప్ర‌చారం బాగా చేస్తున్నారు..

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి  ఆశించినంత స‌క్సెస్ అవుతుందా అంటే  ఆలోచించాలి. ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలి. స్వ‌యంగా డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మే  ప్రింట్ మీడియాకు ఇచ్చిన  ఒక ఇంట‌ర్వూలో  ఈ మాట చెప్పాడు. ఇది మాస్ చిత్రం కాదు  జ‌నాలు పూన‌కం వ‌చ్చిన‌ట్లు థియేట‌ర్ కు ప‌రిగెత్త‌డానికి..ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్. స‌క్సెస్ డిసైడ్ చేయ‌డానికి టైమ్ ప‌డుతుంది అనుకుంటాను అన్నారు.  క‌ట్  చేస్తే.. సినిమా క‌లెక్ష‌న్స్ ప‌డి పోకుండా వుండ‌టానికి  చిత్ర యూనిట్  ప్ర‌చారంలో మాత్రం ఎక్కడా కాంప్ర‌మైజ్  కావ‌డం లేదు. సినిమా విడుద‌లైన రోజే  టాప్ ర్యాంక్ లో వున్న కొన్ని ప్రైవేట్ ఛానెల్స్ కు   ఇంట‌ర్వూలు ఇచ్చేశారు. అది ప్రచారంలో భాగ‌మే.క‌ట్ చేస్తే. తాజాగా.. బ‌న్నీ, త్రివిక్ర‌మ్, అలి, రాజేంద్ర ప్ర‌సాద్, స‌మంత ల‌తో  దాదాపు 45 నిముషాల నిడివి వుండేలా స‌క్సెస్ మీట్ అని ఇంట‌ర్వూ ఇచ్చారు.  మీడియాకు వాళ్లే ఎడిట్ చేసిన ఇంట‌ర్వూ సీడిలు అంద  జేశారు. ఇదంతా చూస్తుంటే..  స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి  క‌లెక్ష‌న్స్ ప‌రంగా  రేసు గ‌ర్రం రికార్డ్స్ ను  క్రాస్ చేయ‌డం కొంత క‌ష్ట‌మే అని చెప్పాలి మ‌రి.