మ‌ణిర‌త్నం వ‌య‌సు 22 సంవ‌త్స‌రాలే..

ద‌ర్శ‌క దిగ్గ‌జం మ‌ణిర‌త్నం వ‌య‌సు ఆరు ప‌దుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. అయితే ఒక క్రియేటివ్ ప‌ర్స‌న్ గా త‌న వ‌య‌సు ఎప్పుడు 22 సంవ‌త్స‌రాలే అంటున్నారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఓకే బంగారం చిత్రం శుక్ర‌వారం త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో మెగా ప్రొడ్యూస‌ర్ దిల్ రాజ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఆడియో విజ‌యోత్స‌వ వేడుక హైద‌రాబాద్ లో చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స‌భ్య‌లు అటెండ్ అయ్యారు. ప్ర‌కాష్ రాజ్, నిత్యామీన‌న్ తో పాటు సిరివెన్నెల సీతారామశాస్ర్తి , దిల్ రాజ్, రెహ‌మాన్ ఈ వేడుక్కు అటెండ్ అయ్యారు. భార‌తీయ వివాహా వ్య‌వ‌స్థ గొప్ప త‌నాని తెలియ జేస్తూ.. ఆ సిస్ట‌మ్ ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో ఎటువంటి మార్పుల‌కు ..కుదుపుకు గురి అయ్యింది అనే పాయింట్ ను ఓకే బంగారంలో డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం డీల్ చేసిన‌ట్లు తెలుస్తుంది.