అంతా హైపే నా..!

పూరీజ‌గ‌న్నాధ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ,బండ్ల గ‌ణేష్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన టెంప‌ర్ చిత్రం ఒక రేంజ్ లో దుమ్ము లేపుతుందని విడుద‌లైన మొద‌టి వారంలో టాక్ వినిపించింది. టెంప‌ర్ క‌చ్చితంగా 50 కోట్ల క్ల‌బ్ లో చేరుతుందని అందరు ఆశించారు. అభిమానులు అయితే మరీ సంతోష ప‌డ్డారు. కానీ అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకుంటదనుకున్న‌ టెంప‌ర్ క‌లెక్ష‌న్స్ 46 కోట్ల వరకే షేర్ వసూలూ చేసింద‌ని ట్రేడ‌ర్స్ తేల్చారు. ఆంధ్రా, తెలంగాణ‌, ఓవ‌ర్సీస్ లో క‌లిపి టోట‌ల్ గా టెంప‌ర్ ఈ షేర్ వ‌సూలు చేసింది.

మ‌రీ ఖ‌ర్చులు అన్ని తీసి, లెక్కలు వేస్తే నెట్ ఏ మాత్రం మిగిలి వుంటుందో ?. ఒవ‌రాల్ గా ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం ప్రొడ్యూస‌ర్ ను సేఫ్ జోన్ లో ప‌డేసింది కానీ, బ‌య్య‌ర్ల ను అంత ఖుషి చేయ‌లేద‌నే చెప్పాలి. సో టెంప‌ర్ చిత్రం హైప్ సంబ‌ర‌మే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వుంటుంద‌ని సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ఆమధ్య‌ ట్విట్ చేసిన బండ్ల గ‌ణేష్ ఇప్పుడు దాల్చాడని అంటున్నారు క్రిటిక్స్.