భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య!

Man suicide
మీరు పొరబడలేదు. ఇదో విచిత్ర వార్త. విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షీలా నగర్ లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… షీలా నగర్ లో అత్తారింట్లో ఓ అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కొత్తవలసలో వెటర్నరీ కాంపౌండర్ గా పనిచేస్తున్న గొటివాడ వెంకటేశం (35) బుధవారం అత్తవారింటికి వచ్చాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత గది లోకి వెళ్ళి ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. అయితే కొన ఊపిరితో ఉన్న అతన్ని 108లో ఆసుపత్రికి తరలించేలోగానే మృత్యవాత పడ్డాడని అంటున్నారు. కాగా మృతుదు తాను ఆత్మహత్య చేసుకునే ముందు కొత్తవలసలోని తన తల్లితో ఫోన్ లో మాట్లాడి భార్య పెట్టిన వేధింపులు తాళలేక పోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడ అత్తారింట్లో తన కుటుంబీకులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద మిస్టరీగా ఉన్న ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.