ఆకాష్ సోలో ఎంట్రీకి రంగం సిద్ధం

akash andhra pori hero
 ఇన్నాళ్లూ చిన్నప్పటి హీరోల క్యారెక్టర్లు.. హీరో ఇంట్లో ఉండే చిన్నాచితకా పాత్రలు చేసిన ఆకాష్ లేత వయసులోనే సిల్వర్ స్క్రీన్ పైకి సోలోగా వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ వేషాలేసిన ఈ పిల్లాడు ఇప్పుడు తనే సోలోగా కనిపించేలా ఆంధ్రా పోరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. ఆంధ్రా పోరి సినిమాలో ఆకాష్ సరసన ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటిస్తోంది.
ఆంధ్రా పోరి సినిమాని వచ్చేనెల 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ గ్యాప్ లో ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి సినిమాకు హైప్ తీసుకురావాలని భావిస్తున్నారు. వచ్చేనెల 2న శిల్పకళావేదికలో ఆంధ్రాపోరి ఆడియో ఫంక్షన్ సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఈ ఆడియో ఫంక్షన్ కు కొంతమంది స్టార్లను రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు పూరి జగన్నాధ్. కొడుకు ఎంట్రీ ఫిలిం కావడంతో.. కుదిరితే ప్రభాస్, అల్లుఅర్జున్, మహేష్ లాంటి స్టార్లను ఆంధ్రాపోరి ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించే పనిలో పడ్డాడు.