దాగుడు మూత దండాకోర్ వ‌చ్చేస్తుంది..!

మ‌నుషులు యంత్రాల్ని క్రియేట్ చేశారు. అయితే మ‌నిషి సృష్టించిన యంత్రాలు ఈ రోజు పూర్తిగా మ‌నిషి ని డామినేట్ చేయ‌డం మ‌హా విషాదం అంటారు సామాజిక శాస్త్ర వెత్త‌లు. స‌మాచార విప్ల‌వం అయితే వ‌చ్చింది కానీ.. మ‌నో వికాస విప్ల‌వం రావ‌డం లేదు. యంత్రాల‌కంటే మ‌నిషి కి ఎమోష‌న్సే హైలెట్ అని చాటి చెప్పే చిత్ర‌మే దాగుడు మూత దండాకోర్ చిత్రం.రాజేంద్ర ప్ర‌సాద్, బేబి సారా, లీడ్ రోల్స్ లో వ‌స్తున్న చిత్రం. తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘శైవం’ను తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి అనుగుణంగా మలిచి దాగుడు మూత దండాకోర్ గా రూపొందించారు. ఉషాకిరణ్‌ మూవీస్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి . ఆర్‌.కె. మలినేని దర్శకుడు. ఈ సినిమా మే 1 న రిలీజ్ చేస్తున్న‌ట్లు స‌మ‌ర్ప‌కులు దిల్ రాజ్ తెలియ చేశారు.