పాకిస్థాన్ లో 40 ఏళ్ల త‌రువాత‌…!

Sholay Hindi Movie

అమితాబ‌చ్చ‌న్, ధ‌ర్మేంద్ర‌, హేమమాలిని, జ‌య బాధురి, సంజీవ్ కుమార్‌, అంజద్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన ‘షోలే’ చిత్రం ఇండియాలో విడుద‌లైన 40 ఏళ్ల త‌రువాత పాకిస్థాన్ లో రిలీజ్ అవుతుంది.దీన్నీ 2డి,3డి రూపాల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా థియేట‌ర్ల ముందు అమితాబ్, ధ‌ర్మేంద్ర‌, అంజద్ ఖాన్ ల క‌టౌట్ల‌ను ఏర్పాటు చేసి యువ‌త సందడి చేస్తోంది.

జావేద్ అక్త‌ర్, గుల్జార్ లు అందించిన ఈ క‌థ‌ను ర‌మేష్ సిప్పి డైరెక్ట్ చేశారు. భార‌త దేశ సినిమా మేకింగ్ లో స‌రికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది ఈ సినిమా అప్పట్లో. టేకింగ్, మేకింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటో గ్ర‌ఫి, ఒక్క‌టేమిటి షోలే’ సినిమాకు సంబంధించిన ప్ర‌తి విభాగం ఇప్ప‌టి చిత్రాల‌కు మార్గద‌ర్శి అంటే అతిశ‌యోక్తి కాదేమో..