బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల స‌మ్మె

బ‌హుళ‌జాతి సంస్థ‌ల కొమ్ముకాస్తూ… ప్ర‌యివేటు టెలికాం సంస్థ‌ల‌కు విచ్చ‌ల‌విడిగా రాయితీలిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఈనెల 21, 22 తేదీల్లో భార‌త్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్‌)) సిబ్బంది దేశవ్యాప్తంగా స‌మ్మెకు దిగుతున్నారు. అత్యాధుని సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ స‌మ‌యంలో దానికి త‌గ్గ‌ట్టు ఎక్విప్‌మెంట్ కొని సంస్థ‌ను విస్త‌రించాల‌ని ఉద్యోగులు డిమాండు చేస్తున్నారు. ల్యాండ్‌లైన్ల‌పై వ‌స్తున్న న‌ష్టాల‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని, ప్ర‌భుత్వ విధానాలే ప్ర‌స్తుత బీఎస్ఎన్ఎల్ దుస్థితికి కార‌ణ‌మ‌ని వార‌న్నారు. విశాల ప్ర‌యోజ‌నాల కోసం కార్మికులు, ఉద్యోగులంతా స‌హ‌క‌రించాల‌ని కోరారు. కాగా ఈ స‌మ్మెకు సిఐటీయు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. సీఐటీయు తెలంగాణ రాష్ట్ర క‌మిటీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ ఉద్యోగులు, కార్మికుల న్యాయ‌మైన డిమాండ్ల‌కు త‌మ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు రేపు, ఎల్లుండి జ‌రిగే స‌మ్మెకు పూర్తిగా స‌హ‌క‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.