ముందు నాకు సంతృప్తినివ్వాలి…

క‌థ‌కు మాత్ర‌మే పెద్ద పీట వేసే హీరోయిన్స్ లో నిత్య‌మీన‌న్ నెంబ‌ర్ వ‌న్ అనే చెప్పాలి. త‌నకు కధ‌ నొచ్చ‌క పోతే రెండో ఆలోచ‌నే లేకుండా నో చెప్పేస్తుంది. గ‌త యేడాది నిత్యా న‌టించిన చిత్రాలే ఏ ఒక్కటి విడుద‌ల కాలేదు కానీ.. ఈయేడాది అప్పుడే రెండు చిత్రాల‌తో సంద‌డి చేసింది. ఏ హీరోయినైన ఒక్కసారైన‌ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలోని న‌టించాలని ఆశపడతారు. ఆ కల‌ ఓకే బంగారం సినిమా ద్వారా సాకారమైంది. ఈ సినిమాలో నిత్యా యాక్టింగ్ కు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. ఇక స‌న్నాప్ స‌త్య‌మూర్తిలోను ఒక కీ రోల్ చేసింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో నిత్యా మాట్లాడుతు త‌న న‌టించ‌డానికి ఏ అంశాలు కీల‌కం అనేది తెలిపింది. స్టోరిలో త‌న రోల్ నిడివి అనేది త‌న‌కు లెక్క కాదట‌. కానీ త‌న రోల్ కు ప్రాధాన్య‌త లేక పోతే అది రెండున్న‌ర గంట‌ల రోల్ అయిన న‌టించ‌ద‌ట‌.ఇక న‌టీ న‌టుల మ‌ధ్య కెమిస్ట్రీ గురించి కూడా నిత్యా త‌న‌దైన విశ్లేషణ‌ చెప్పింది. నటించ బోయో రోల్ ను ఎంత బాగా అర్ధం చేసుకుని న‌టిస్తే అంత బాగా పండుతుందిని తెలిపింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అయిన త‌న రోల్ కు ఇంపార్టెన్స్ లేక పోతే చేయదట‌. త‌న‌కు టాలీవుడ్ చాల ప్ర‌త్యేక‌మ‌ని తెలిపింది. బాలీవుడ్ పై ఆస‌క్తి లేద‌ని తేల్చేసింది…