మూకుమ్మడిగా షాకిచ్చిన ప్రీతి

బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా ప్రీతిజింటాను ఎవరూ మరిచిపోలేరు. ఆ సొట్టబుగ్గలు, సోగకళ్లు ఇంకా కుర్రాళ్లను  వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఈమధ్య సినిమాల కంటే బిజినెస్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది ప్రీతిజింటా. ఐపీఎస్ ఫ్రాంచైజీతో పాటు పలు చైన్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ఈ ముద్దుగుమ్మకి. దీనికి తోడు ఈమధ్యే తన పాత బాయ్ ఫ్రెండ్ కు కూడా బైబై చెప్పేయడంతో మరింత ఉత్సాహంగా ఉంది ప్రీతి. 
ప్రీతి ప్రస్తుతం సింగిల్ గా ఉంది కాబట్టి బాలీవుడ్ నిర్మాతల దృష్టి ఆమెపై పడింది. తమ సినిమాల్లో ఐటెంసాంగ్స్ కోసం కొందరు నిర్మాతలు ఆమెని సంప్రదించారు. అప్పుడే సొట్టబుగ్గల చిన్నదాని విశ్వరూపం కనిపించింది సదరు నిర్మాతలకు. ఐటెంసాంగ్స్ చేసే రేంజ్ కు తనింకా పడిపోలేదని ప్రొడ్యూసర్లకు క్లాస్ పీకింది ప్రీతి. ఏవైనా హీరోయిన్ ఆఫర్లు ఉంటే పట్టుకురండని సలహాలిచ్చింది. దీంతో షాకవ్వడం నిర్మాతల వంతయింది. ఎంతోమంది రైజింగ్ బ్యూటీలు ఉండగా ఏరికోరి ప్రీతిజింటా లాంటి ఓల్డ్ బ్యూటీని ఎవరూ సినిమాల్లోకి తీసుకోరు. అందుకే మెల్లగా అక్కడ్నుంచి జారుకున్నారు. అయితే కొందరు నిర్మాతలు మాత్రం ప్రీతిని ఎదిరించారు. సల్మాన్ సినిమాలో ఐటెంసాంగ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తను కేవలం సల్మాన్ సినిమాల్లో మాత్రమే ఐటెంసాంగ్స్ చేస్తానని ప్రీతి చెప్పడంతో ఆ ఎదిరించిన ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు కూడా అక్కడ్నుంచి వెళ్లిపోయారు.