శృతి హాస‌న్ అంద‌రికి పంచేస్తుంద‌ట‌..

shruthi-hassan-success

జ‌య‌ప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా న‌చ్చింది చేసుకుంటు ముందుకు వెళ్లే హీరోయిన్స్ లో శృతి హాస‌న్ ఒక‌రు. తండ్రి క‌మ‌ల్ హాస‌న్ మాదిరే త‌నుకూడా కొత్త‌ద‌నానే ఇష్ట‌ప‌డుతుంది. కొత్త ద‌నం కోసం ట్రై చేయ‌డానికి త‌న‌కు ఏ విధ‌మైన భ‌యాలు ఉండ‌వ‌ట‌. ఇక సినిమా అనేది స‌మిష్టిగా చేసే వ‌ర్క్. అయితే స‌క్సెస్ అనేది హీరో, హీరోయిన్ కే ముందు వ‌స్తుంది. ఫెయిల్యూర్ అనేది మాత్రం కొంద‌ర్నే టార్గెట్ చేస్తారు. అయితే త‌ను స‌క్సెస్ ను మాత్రం అంద‌రికి పంచేస్తుంద‌ట‌. ఫెయిల్యూర్ ను పెద్ద‌గా మైండ్ లో పెట్టుకుని బాధ ప‌డ‌నంటోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు స‌ర‌స‌న శ్రీ‌మంతుడు చిత్రంలో న‌టిస్తుంది. బాలీవుడ్ లో ఒక‌టి.. కోలీవుడ్ లో విజ‌య్ స‌ర‌సన పులి చిత్రాల్లోన‌టిస్తూ కెరీర్ ప‌రంగా ఈ హాట్ బ్యూటీ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.