మాజీ ఎయిర్‌హోస్ట‌స్ అనుమానాస్ప‌ద మృతి

హైద‌రాబాద్‌లోని రామంతాపూర్‌ ప్రాంతంలో నివాస‌ముంటున్న మాజీ ఎయిర్ హోస్ట‌స్ రీతూ అనుమాన‌స్ప‌ద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈమె జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన‌దిగా చెబుతున్నారు. చాలాకాలం నుంచి ఇక్క‌డే ఉంటున్న రీతూ 16 నెల‌ల క్రితం జార్జండ్‌కే చెందిన స‌చిన్ అనే వ్య‌క్తిని ప్రేమ వివాహం చేసుకుంది. త‌న కూతురు చ‌నిపోవ‌డానికి ఆమె భ‌ర్త స‌చినే కార‌ణ‌మ‌ని రీతూ త‌ల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌చిన్ అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.