బాలిక‌పై అత్యాచారం, హ‌త్య‌

నెల్లూరు: ముక్కు ప‌చ్చ‌లార‌ని ప‌సికందు… ఇంకా మ‌న‌షులకు మృగాల‌ల‌కు తేడా కూడా ఏమిటో తెలియ‌ని ప‌సిత‌నం. అయినా కండ‌కావ‌రంతో ఉన్న కామాంధుల‌కు ఇవేమీ ప‌ట్ట‌లేదు. ఆ పాప‌ని చెర‌బ‌ట్టారు. తాము చేసిన ఘాతుకం గురించి చెప్పేంత వ‌య‌స్సుందో లేదో కూడా ఆలోచించ‌లేదు ఆ క్రూరులు. త‌మ శ‌రీర వాంఛ తీర్చుకుని ఆపై చంపేశారు. ఆ చంప‌డం కూడా చాలా పాశ‌వికంగా చేశారు. నెల్లూరు జిల్లా కావ‌లిలో ఈ దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. కామాంధులు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హ‌త్య చేశారు. పాప‌ను రాళ్ళ‌తో కొట్టి చంపేసిన‌ట్టు తెలుస్తోంది. చిన్నారి మృత‌దేహం  రోడ్డు ప‌క్క‌నున్న ముళ్ళ‌పొద‌ల్లోకి విసిరేసి పారిపోయారు. ఈ విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం ఆరా తీస్తూ ద‌ర్యాప్తు ప్రారంభించారు.