మే లో జాదూగాడు

నాగ‌శౌర్య హీరోగా న‌టించిన యాక్ష‌న్ చిత్రం జాదూగాడు ఆడియో ఈ రోజు విడుద‌ల‌యింది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి సాగ‌ర్ తొలిసారి ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. నాగ‌శౌర్య రేంజ్ కి మించి ఖ‌ర్చు పెట్టిన ఈ సినిమా ఫ‌స్ట్ కాపీ రెడీ అయింది. ల‌య‌న్, కిక్ -2, రుద్ర‌మ‌దేవి లాంటి పెద్ద సినిమాల రిలీజ్ డేట్ చూసుకుని జాదూగాడు రిలీజ్ చేద్దామ‌నుకుంటున్నారు. బ‌హుశా మే మొద‌టి వారంలో కాని, రెండ‌వ వారంలో కానివిడుద‌ల‌వుతుంది.