పెళ్లి రోజు మిస్సయిన స్టార్ జంట

బాలీవుడ్ లో మోస్ట్ సెలబ్రిటీ కపుల్ ఎవరంటే ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ పేర్లే చెబుతారు ఎవరైనా. ఈ జంటకున్నంత స్టార్ స్టేటస్ బాలీవుడ్ లో మరో పెయిర్ కు లేదు. అలాంటి హాట్ జంట తమ పెళ్లి రోజును మిస్సయింది. నిన్నటితో 8 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తిచేసుకుంది ఐష్-అభి జంట. పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని నెలరోజుల కిందటే భార్యభర్తలు ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. తన సినిమా షూటింగ్ కారణంగా అభిషేక్ బచ్చన్ విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న ఐశ్వర్యరాయ్ తన కొత్త సినిమా షూటింగ్ లో మునిగిపోయింది. దీంతో ఇద్దరూ పెళ్లిరోజును మిస్సయ్యారు. అయితే సాయంత్రం డిన్నర్ టైమ్ కు మాత్రం అందరూ కలిశారు. చక్కగా భోజనం చేస్తూ పెళ్లి రోజును గ్రాండ్ గా ముగించారు.