శృతి హాస‌న్ పై కేసు ఉపసంహరణ‌

హీరోయిన్ శృతిహాస‌న్ కు పెద్ద ఉప‌శ‌మ‌నం.పిక్చర్ హౌస్ మీడియా  ప్రైవేట్ లిమిటెడ్ వారు శృతిహాస‌న్ పై పెట్టిన కేసును ఉప‌సంహ‌రించుకున్నారు. కోలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ మ‌రియు సౌత్ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ స‌భ్యులు క‌ల‌గ చేసుకోవ‌డంతో ఈ పంచాయితి ఒక దారికి వ‌చ్చింది. టీపీఎఫ్ సీ అధ్యక్షుడు కలైప్పులి తాను, ఎస్ఐఏఏ అధ్యక్షుడు శరత్ కుమార్ తదితరులు పిక్చర్ హౌస్ మీడియా ప్రతినిధులతో చర్చించారు.

నాగార్జున, కార్తీ లీడ్ రోల్స్ లో చేస్తున్న చిత్రంలో ముందుగా శృతి హాస‌న్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆ త‌రువాత ఏవో తేడాలు రావ‌డంతో శృతిహాస‌న్ డ్రాప్ అయ్యింది. దీంతో నిర్మాణ సంస్థ ఆమె పై కేసు వేశారు. అయితే ఎట్ట‌కేల‌కు ఈ స‌మ‌స్య సాల్వ్ కావడంతో ఆ హాట్ బ్యూటీ పండ‌గ చేసుకుంటుందని స‌మాచారం. అయితే శృతి హాస‌న్ ప్లేస్ లో త‌మ‌న్నాను తీసుకున్నారు. వంశీ పైడిప‌ల్లి ఈ మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేస్తున్నారు.