తిప్ప‌లు ప‌డుతున్న సింహాద్రి అప్ప‌న్న భ‌క్తులు

విశాఖ‌ప‌ట్నం: చ‌ంద‌నోత్స‌వంలో పాల్గొని స్వామి నిజ‌రూప‌ ద‌ర్శ‌నం చేసుకుందామ‌ని వ‌చ్చిన‌ సింహాద్రి అప్పన్న‌ భ‌క్తులు తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌వుతున్నారు. వేలాదిగా వ‌చ్చిన భ‌క్తుల‌కు ఆల‌య అధికారులు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌క‌పోవ‌డంతో నానా అగ‌చాట్ల‌కు గుర‌వుతున్నారు. వివిధ మీడియాల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌కు స్పందించిన అధికారులు ఎండ‌లో ఉన్న భ‌క్తుల‌కు కాళ్ళు కాల‌కుండా ఉండేందుకు కార్పెట్లు ప‌రిచి తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లిగించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ అవి ఏ మాత్రం స‌రిపోవ‌డం లేదు. అలాగే మంచినీటికి కూడా చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. పిల్లాపాప‌ల‌తో క్యూల్లో నిల‌బ‌డిన భ‌క్తులు ఎండ వేడికి త‌ట్టుకోలేక సొమ్మ‌సిల్లి ప‌డిపోతున్నారు. వేలాది మంది భ‌క్తులు వ‌స్తార‌ని తెలిసిన‌ప్ప‌టికీ త‌గిన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.