లారెన్స్ గంగ కి మోక్ష‌మెప్పుడో ?

ముని, కాంచ‌న సిరీస్ లో భాగంగా రూపొందిన హార‌ర్ సినిమా గంగ ఏప్రిల్ 17 న త‌మిళ‌నాట విడుద‌ల‌యింది. సూప‌ర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఆ రోజునే విడుద‌ల కావ‌ల్సి ఉంది. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ ఫైనాన్సియ్య‌ర్ల‌కు దాదాపు 30 కోట్ల వ‌ర‌కూ పాత బాకీలు తీర్చాల్సిఉంది. వాళ్ళు అడ్డు ప‌డ‌టంతో గంగ తెలుగులో రిలీజ్ కాలేదు. ఇప్పుడు త‌మిలంలో హిట్ కావ‌డంతో ముందు రిలీజ్ చేస్తే బాకీ లు తీరుస్తాన‌ని సురేష్ చెప్పిడ‌ట‌. ఫైనాన్సియ్య‌ర్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ట‌. అది క్లియ‌ర్ అయితే ఈ శుక్ర‌వార‌మే గంగ ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.