స‌ల్మాన్ ఖాన్ కు ప‌దేళ్లు ప‌డుతుందా..!

బాలీవుడ్   స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కు కాలం క‌ల‌సి రాక‌పోతే   రానున్న ప‌దేళ్లు అయిన జైల్లో గ‌డ‌పాల్సిందే.   మే 6న స‌ల్మాన్ భ‌విత‌వ్యం తేల‌నుంది. 2002 , సెప్టెంబ‌ర్ 28 న  ముంబాయి , బాంద్రా లో   నిద్ర‌స్తున్న వారి పై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో ఒక‌రు మృతి చెంద‌గా ఒక‌రు గాయ ప‌డ్డారు. 13 సంవ‌త్స‌రాల నుంచి ఈ కేసు న‌డుస్తుంది.  ఆ స‌మ‌యంలో  స‌ల్మాన్ మ‌ద్యం సేవించి కారు న‌డిపాడ‌ని   పోలీసులు స‌ల్మాన్ పై అభియోగం మోపి  సాక్ష్యాలు కోర్టు ముందుంచారు. అయితే గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా ప్రమాదం జరిగిన సమయంలో కారును  తాను నడపలేదని  సల్మాన్  వాంగ్మూలమిస్తే , తానే నడిపానని సల్మాన్ డ్రైవర్ తెలిపాడు.  దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు తీర్పు ఎలా ఉంటుందో అని ఆందోళనలో ఉన్నారు. ఒక వేళ్ల స‌ల్మాన్ భాయ్ కి 10 ఏళ్లు శిక్ష ప‌డితే ..ఇక ఆయ‌న  కెరీర్ ముగిసిన‌ట్లే అంటున్నారు ప‌రిశీల‌కులు. అభిమానులు మాత్రం స‌ల్లుభాయ్ బ‌యట ప‌డాల‌నుకుంటున్నారు.