మాటలు నేర్చిన ముద్దుగుమ్మ..

ఏ హీరోయిన్ కైనా తొలి సినిమానే మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరోతో నటించే అవ‌కాశం రావ‌డం అంటే న‌క్క తోక‌ను తొక్కిన‌ట్లే అని అనాలి. ఉత్త‌రాది ముద్దుగుమ్మ కృతి స‌నన్ కు అలాంటి ఛాన్స్ ద‌క్కింది. సుకుమార్ , మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో వ‌చ్చిన వ‌న్ చిత్రం లో డెబ్యూ హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యింది. అయితే సినిమా స‌క్సెస్ యావ‌రేజ్ గా న‌మోదు కావ‌డంతో..కృతి స‌న‌న్ కెరీర్ తెలుగులో ఆశించినంతగా లేదు. అయితే అలా అని మ‌రీ కెరీర్ బ్యాడ్ గాను లేదు. తెలుగులో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయిన త‌రువాత హిందిలో కూడా ఒక‌టి రెండు చిత్రాలు చేసింది. తాజాగా నాగ చైత‌న్య స‌ర‌స‌న దోచేయ్ చిత్రంలో న‌టించింది.

ఈ చిత్రంలో కృతి స‌న‌న్ ది టామ్ బాయ్ రోల్. క్లాసుల‌కు బంక్ కొట్టి సినిమాల‌కు చెక్కే ర‌క‌మ‌ని తెలిపింది. సినిమా విడుద‌లైన సంద‌ర్బంగా మీడియాకు ప‌ల విశేషాలు చెప్పింది. త‌న‌కు టాలీవుడ్, బాలీవుడ్ రెండు ముఖ్యమే అని తెలిపింది. ఇక దోచేయ్ డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ గురించి చెబుతూ.. ఆయ‌న ప్ర‌తిభావంతుడు. సినిమా ఎప్పుడు ప్రారంభించి..ఎప్పుడు పూర్తి చేశాడో కూడా తెలియ‌కుండా చేశాడ‌ని కితాబిచ్చింది.ఇక బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుక్ చేయ‌బోయో దిల్ వాలే చిత్రంలో కృతి స‌న‌న్ ఓ అవ‌కాశం వ‌రించింది.అలాగే త‌ను లీడ్ రోల్ చేసే ఫ‌ర్జీ చిత్రం కూడ త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభం కాబోతుంద‌ట‌.