సీక్రెట్ కెమెరాలుంటాయని భ‌య‌మ‌ట‌..!

ప్ర‌భాస్ బుజ్జిగాడు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌న్న‌డ భామ సంజ‌న  ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా  క‌న్న‌డంలో బిజీగా ఉంది.  ప్ర‌స్తుత టెక్నాల‌జీ  హీరోయిన్స్  పాలిటి  న‌ర‌కంగా మారిందని వ్యాఖ్య‌నించింది. ముఖ్యంగా హీరోయిన్స్ షూటింగ్ నిమిత్తం హోట‌ల్స్ లో బ‌స చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. స్నానం చేయాల‌న్నా..బ‌ట్ట‌లు మార్చుకోవాల‌న్నా భ‌య ప‌డాల్సిన ప‌రిస్థితి ఉందని..  గ‌తంలో కొందరు హీరోయిన్స్ ఇలా ఇబ్బంది ప‌డ్డారని దాంతో  ఎక్క‌డైన హోట‌ల్ లో బ‌స చేస్తే  అనువ‌ణువునా చెక్ చేస‌కోవాల్సి వ‌స్తుంద‌ని వాపోయింది.అయితే సాధార‌ణంగా స్టార్ హోట‌ల్స్ లో ఇలాంటి పరిస్థితి ఉండదని, అక్క‌డ స్టాఫ్ లో ఎవ‌రైన కొందరు ఇలా చేయ్యోచ్చు అని అంటున్నారు ప‌ర‌శీలకులు.   అయితే ప్ర‌స్తుతం  ర‌హస్య‌ కెమ‌రాలుంటే   క‌నిపెట్టే యాప్ ఒక‌టుంద‌ని.. దాన్ని ఉప‌యోగించి  అటువంటి వాటినుంచి బ‌య‌ట పడొచ్చు అంటుంది సంజ‌న‌.