గీతాఆర్ట్స్ కార్యాలయంలో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

మెద‌టి చిత్రం నుండి వ‌రుస విజ‌యాలు సాదిస్తూ టాలీవుడ్ లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ రోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. త‌ను చేసిన ప్ర‌తి చిత్రం వ‌రుస విజ‌యాలు సాదించ‌మే కాకుండా త‌న రేంజి ని పెంచుకుంటూ వ‌చ్చారు. మాస్‌ ఇమేజ్ కి కేరాఫ్ అడ్రాస్ గా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను తెలుగు అభిమానుల గుండెల్లో మంచి స్టానాన్ని సంపాయించారు. ఈ రోజు (ఏప్రిల్ 25) ఈ సూప‌ర్‌స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు పుట్టిన‌రోజు సందర్బంగా ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ కార్యాల‌యంలో ఎస్‌ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్‌, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ లు క‌లిసి ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కి అభినంద‌న‌లు తెలిపి త‌న‌ చేత పుట్టినరోజు కేక్ క‌ట్ చేయించారు. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా గీతాఆర్ట్స్ లో త్వ‌ర‌లో చిత్రం ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ని గీతాఆర్ట్స్ స్టాఫ్ అంద‌రూ అభినంద‌న‌లు తెలిపారు.