అంద‌గ‌త్తే శాండ్రాబుల్ల‌క్‌..

బ్యూటీ అంటే ఫిజిక‌ల్ గా క‌నిపించడమే అని అనుకుంటారు. ఈ విషయాన్ని చాల గ్లామ‌ర్ మ్యాగ‌జైన్స్ అలాగే ప్రొజెక్ట్ చేస్తాయి. అయితే అన్ని ప‌త్రిక‌లు ఒకేలా వుండ‌వు. ప్ర‌తిష్టాత్మ‌క పీపుల్స్ మ్యాగ జైన్ 2015 సంవ‌త్స‌రానికి హాలీవుడ్ న‌టి శాండ్ర బుల‌క్ ను ప్ర‌పంచ అంద‌గ‌త్తే గా ఎంపికి చేసింది. పీపుల్స్ పత్రిక రాబోయో సంచిక ముఖ చిత్రం పై శాండ్ర‌బుల్ల‌క్ క‌నిపించ‌నుంది. దీనికి సంబంధించి శాండ్ర మాట్లాడుతూ వింత‌గా ఉంది. నిజ‌మైన అందం రూపంలో ఉండ‌దు. మ‌న‌సులో ఉంటుంది . అందం గురించి ఆలోచించ‌ని వారే అందంగా వుంటార‌ని తెలిపింది.1982 సంవ‌త్స‌రంలో హ్యాంగ్ మెన్ అనే థ్రిల్ల‌ర్ చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది.

న‌టిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకుంది. న‌టిగానే కాకుండా..నిర్మాత గా కూడా మిస్ కాన్ జినియానిటి, జార్జి లోపెజ్ వంటి చిత్రాలు చేశారు. ఇక గ్రావిటి అనే చిత్రంలో న‌టించిన సినిమాకు అస్కార్ నామినేష‌న్ వ‌చ్చింది. సోష‌ల్ స‌ర్వీస్ విష‌యంలో శాండ్ర బుల్ల‌క్ హాలీవుడ్ బెస్ట్ హీరోయిన్స్ లో నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో ఉంటుంది. బహుష‌ త‌న ఎంపిక‌కు సోష‌ల్ స‌ర్వీసే ప్రధాన కారణం అయ్యింటుదని ప‌ర‌శీకుల న‌మ్మ‌కం. హాలీవుడ్ లో అత్యధిక‌ పారితోషికం అందుకునే నటుల్లో శాండ్ర‌బుల్ల‌క్ ఒక‌రు అనే విష‌యం తెలిసిందే.