ఇదొక వైరైటీ కాంబినేషన్

రీసెంట్ గా సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నాడు. ఆ కొత్త సినిమాలో అన్నీ క్రేజీ కాంబినేషన్లే. ఎవరూ ఊహించని జోడీలే. అలాంటి క్రేజీ మూవీలో సందీప్ సెట్ అయ్యాడు. మేటర్ లోకి వస్తే.. ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు నిర్మాతగా మారబోతున్నాడు. అది కూడా తన మేనల్లుడు సందీప్ కిషన్ కోసం. సందీప్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు ఛోటా. ఆ సినిమాకి దర్శకుడిగా వినాయక్ ను అనుకుంటున్నాడు. ఇప్పటికే వినాయక్-సందీప్ మధ్య మాటామంతీ పూర్తయింది. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన సమంత హీరోయిన్ గా నటించబోతోంది. స్టార్ హీరోలకు కాల్షీట్లు కేటాయించడానికే సమంత దగ్గర సమయం లేదు. అలాంటిది సందీప్ కిషన్ సరసన నటించడానికి ఒప్పుకుందనే వార్త టాలీవుడ్ ను షాక్ కు గురిచేస్తోంది. అయితే పారితోషికం దండిగా ముట్టజెపితే ఎవరి సరసనైనా సినిమా చేయడానికి అభ్యంతరం లేదని గతంలోనే అల్లుడు శీను సినిమాతో ప్రూవ్ చేసింది సమంత.