నాగార్జున బాట‌లో అఖిల్..!

ఒకప్పుడు అక్కినేని నాగార్జున కి బాగా మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా ‘శివ’. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా అప్పటి మాస్ ఆడియన్స్ కి, అలాగే స్టూడెంట్స్ కి ఎంత ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇక అప్పటి నుండి నాగార్జున లెవెల్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా అంతలా ఆడడానికి ముఖ్యమైన కారణం సైకిల్ చైన్ సీన్. పక్కన ఉన్న సైకిల్ చైన్ ని తీసి చేతికి చుట్టుకుంటూ విలన్స్ తో ఫైటింగ్ చేసిన సీన్ ఇప్పటికీ కళ్ళముందే మెదులుతూ ఉంటుంది. వర్మ అప్పట్లో అంత అద్బుతంగా దానిని తెరకెక్కించాడు.

మళ్ళీ అదే సీన్ ని నాగార్జున వారసుడు అఖిల్ హీరో గా వస్తున్న సినిమాలో పెట్టాలని ఆ సినిమా యూనిట్ ఉత్సాహంగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సీన్ ఎంత పాపులర్ అయ్యిందో తెలుసు, దానిని పెట్టడం వల్ల అఖిల్ కి కూడా ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఈ సీన్ కి డైరెక్టర్ వినాయక్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని సమాచారం. మరి కొడుకు సినిమా అంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకునే నాగ్, ఈ సీన్ పైన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది పెద్ద చర్చ గా మారింది. మరి అంతా నాగార్జున చేతుల్లోనే ఉంది మరి..