థ‌మ్స్ అప్ యాడ్‌కు విశాల్‌!

హీరో విశాల్‌కు అరుదైన అవ‌కాశం ల‌భించింది. థ‌మ్స్అప్‌కు ఇపుడు విశాల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌ని చేస్తారు. ఇప్ప‌టివ‌ర‌కు ద‌క్షిణాదిలో మెగా హీరో చిరంజీవికి, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు మాత్ర‌మే ఈ అవ‌కాశం ద‌క్కింది. ఇపుడు ద‌క్షిణాదిలో అగ్ర‌శ్రేణి హీరోల‌ను కాద‌ని విశాల్ ఈ అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఆర్‌యు ఫిల్మ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై త‌యార‌య్యే ఈ యాడ్‌కు క‌పిల్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా సంగీతాన్ని రామ్ సంప‌త్ స‌మ‌కురుస్తారు. తెలుగులో హీరోగా అనుకుంటున్న‌ప్ప‌టికీ విశాల్ నిజానికి త‌మిళ‌హీరో. ఆయ‌న హిట్ సినిమాల‌న్నీ త‌మిళంలో నిర్మించిన‌వే. స్ట్రైట్ గా తెలుగులో విశాల్ ఇంత‌వ‌ర‌కు న‌టించ‌లేదు. అయితే అత‌ను తెలుగు హీరోల్లో ఒక‌డుగా ఇక్క‌డ మార్కెట్ సంపాదించుకున్నాడు. యాక్ష‌న్ హీరోగా మంచిపేరుతెచ్చుకున్న‌ విశాల్‌కు ఇది నిజంగా మంచి మైలేజీ ఇస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.