లయన్ రాక తెలిసిపోయింది

బాలకృష్ణ నయామూవీ లయన్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఫిక్స్ చేశారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాను మే 7న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించారు. సత్యదేవ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన పాటల్లో 3 మంచి టాక్ తెచ్చుకున్నాయి.
నిజానికి లయన్ సినిమాను మే 1న గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనుకున్నారు. అన్-అఫీషియల్ గా అందరికీ ఆ సమాచారం అందించారు కూడా. కానీ సినిమాకు సంబంధించి ఇంకా బిజినెస్ పూర్తికాకపోవడంతో వారం రోజుల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. నైజాంతో పాటు ఓవర్సీస్ రైట్స్ కూడా అమ్ముడుపోవడంతో లయన్ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. లెజెండ్ లాంటి భారీ విజయం తర్వాత, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా లయన్. అందుకే అంచనాలు ఆకాశాన్నంటాయి.