నీలి చిత్రాల కంటే హిట్ చిత్రాలకే డిమాండ్ ?

పైరసీకి వ్యతిరేకంగా ఈమధ్య ప్రచారం బాగా తగ్గింది. దానికి తగ్గట్టుగానే పైరసీని అరికట్టేవిధంగా నిర్వహించే దాడులు కూడా తగ్గాయి. దీంతో మరోసారి పైరసీ మార్కెట్ పెరిగిపోయింది. సాక్ష్యాత్తూ హైదరాబాద్ నగరం నడిబొడ్డునే పైరసీ సీడీలు అమ్మేస్తున్నారు. అది కూడా ప్రముఖమైన  షాపుల్లో ఈ మార్కెట్ యధేచ్చగా సాగిపోతోంది. కొన్నాళ్లుగా పైరసీపై దృష్టిపెట్టని అధికారులు మరోసారి దానిపై కన్నేశారు. ఫలితంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో పాపులర్ షాపుల్లోనే నిర్వహిస్తున్న పైరసీ గుట్టు రట్టయింది. అయితే ఈసారి అధికారులు అవాక్కయ్యే విషయం ఒకటి బయటపడింది. సాధారణంగా ఇలాంటి దాడుల్లో నీలిచిత్రాలు ఎక్కువగా బయటపడుతుంటాయి. కానీ ఈసారి నీలి చిత్రాల కంటే హిట్ చిత్రాలే ఎక్కువగా దొరికాయి. జస్ట్ 24 గంటల కిందట రిలీజైన దోచేయ్ సినిమాతో పాటు సన్నాఫ్ సత్యమూర్తి మూవీ కూడా పైరసీ మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతోంది. ఎక్కువమంది నీలిచిత్రాల కంటే ఈ హిట్ సినిమాల్నే కోరుకుంటున్నారని స్వయంగా పైరసీ చేస్తున్న దగుల్బాజీలే చెప్పడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయింది.