పూరి జగన్నాథ్ పెళ్లి గోల.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాటల ద్వారా వివాదాలకు ముందు ఉండేది డైరెక్టర్ రాం గోపాల్ వర్మ. తను ఏం మాట్లాడినా అది ఒక సెన్సేషన్ న్యూస్ అవుతుంది. దానికి అనుగుణంగానే ఉంటాయి వర్మ మాటలు కూడా. అందుకే వర్మ ఎప్పుడు ఏ న్యూస్ తో బయటకి వస్తాడా అని మీడియా వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే డైరెక్టర్ వర్మ నుండి వివాదాల వర్మ గా మారిపోయాడు. ఇప్పుడు ఇలాంటి జాబితా లోకి నేను కూడా చేరిపోతా.. అన్నట్లుగా మరో డైరెక్టర్ ముందుకు వచ్చాడు. 
తన సినిమాలలో ఒక ప్రత్యేక కోణాన్ని చూపించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. మాస్ డైలాగ్స్ చెప్పించి ప్రేక్షకుడికి కావలసిన వినోదాన్ని అందించడంలో పూరి స్టైలే డిఫరెంట్. అందుకే పూరి సినిమా అంటే సఘటు అభిమాని ఎప్పుడెప్పుడా అని చూస్తూ ఉంటాడు. రీసెంట్ గా జరిగిన ‘365 డేస్’ సినిమా ఆడియో ఫంక్షన్ లో పెళ్ళిళ్ళ గురించి పూరి ఒక హాట్ కామెంట్స్ చేసాడు. ‘ఇకపైన ముందు ముందు పెళ్ళిళ్ళు ఉండవు. ఆడ, మగ కలిసి ఫ్రెండ్స్ గానే ఉండిపోతారు చివరకు ‘ అంటూ మాటలు విసిరాడు. పూరి చెప్పిన ఈ మాటలకు అర్థం ఏమిటో? అది పూరీనే వివరణ ఇచ్చుకోవాలి..