ఉదయభాను ఏమయింది?

ఉదయభాను అంటే ఒకప్పుడు యువతరంతో పాటు మధ్యవయస్కులు కూడా ప్రత్యేక ఆసక్తి చూపించేవాళ్ళు. తల్లిదండ్రులతో విభేదాలు, అసిస్టెంట్‌ను పెళ్ళి చేసుకోవడం లాంటి సంఘటనల మధ్య నిత్యం మీడియాలో ఆమె పేరు నానేది. వీటికి తోడు ఏ ఛానల్‌ పెట్టినా ఆమె కనిపించేది. ఆమెకోసమే ఆ ఛానల్‌ చూసే వాళ్ళు మరి కొందరు. అలాంటిది ఇప్పుడు ఒక్క జెమినీ ఛానల్‌లో వారానికి ఒక్కసారి వచ్చే "పిల్లలు-పిడుగులు'' షోలో తప్ప మరెక్కడా కనిపించడం లేదు.. ఎందువల్ల? ఎందుకు "తెర'మరుగై పోయింది?