శివుడిగా కనిపించడానికి రెడీ

బాలీవుడ్ లో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు అక్షయ్ కుమార్. సింగ్ ఈజ్ కింగ్ లో సిక్కు యువకుడిగా మెప్పించాడు. ఓ మై గాడ్ లో మోడ్రన్ కృష్ణుడిగా మెప్పించాడు. తన రెగ్యులర్ సినిమాలతో యాక్షన్ హీరోగా కూడా అదరగొడుతున్నాడు. ఇప్పుడీ సీనియర్ నటుడికి శివుడి పాత్రపై మనసుమళ్లింది. భారతదేశంలో సూపర్ హిట్టయిన ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహ పుస్తకంలో ఉన్న శివుడి పాత్రను చేయాలని ఉందనే కోరికను బయటపెట్టాడు అక్షయ్. ఈ పుస్తకం తెలుగులో కూడా శివత్రయం పేరుతో విడుదలైంది. కొన్ని లక్షల మంది చదివి మెచ్చుకున్న పుస్తకం ఇది. ఇందులో శివుడి పాత్రను అద్భుతంగా చూపించారు. మనలో ఒకడిగా ఓ సామాన్య వ్యక్తిగా ఉన్న శివ, తర్వాత దేవుడిగా ఎలా రూపాంతరం చెందుతాడనే విషయాన్ని చక్కగా రాసుకొచ్చారు. ఈ పుస్తకం నచ్చిన అక్షయ్ కూడా సేమ్ కథతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ పుస్తకం హక్కులు దక్కించుకోలేదు అక్కీ.