కుర్రాడికి ఇంకా మార్కెట్ ఉన్నట్టుంది..?

హీరో సిద్దార్థ్ ను దాదాపు టాలీవుడ్ మరిచిపోయింది. ఈమధ్య అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ అవేవీ తెలుగు తెరపై వర్కవుట్ కాలేదు. దీంతో సిద్ధూ పూర్తిగా తమిళ పరిశ్రమకే ఫిక్స్ అయిపోయాడు. పనిలోపనిగా తమిళ్ లో చేసిన సినిమాల్ని డబ్బింగ్ చేసి తెలుగులోకి వదులుతున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగులో ఫక్తు డబ్బింగ్ హీరోగా మారిపోయాడు సిద్దార్థ్. 
అదే ఇమేజ్ తో ఇప్పుడు మరో తమిళ సినిమాలపై తెలుగుప్రేక్షకులపైకి వదులుతున్నాడు సిద్ధూ. దీపా సన్నిధితో కలిసి చేసిన ఎన్నకుల్ ఒరువన్ సినిమాను నాలో ఒకడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు నడుస్తున్నాయి. అయితే ఇన్నేళ్లయినా సిద్ధూకు తెలుగు మార్కెట్ తగ్గలేదనే విషయం నాలో ఒక్కడు సినిమాతో రుజువైంది. ఈ సినిమాలో సరుకు ఎంతుందో తెలీదు కానీ.. సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ఏకంగా 75లక్షల రూపాయలు చెల్లించింది మా టీవీ.