మరోసారి తెలుగుతెరపైకి

 ఆపిల్ పిల్ల హన్సిక కోలీవుడ్ లో ఫుల్ బిజీ. రోజుకు 3 కాల్షీట్లతో బిజీగా ఉంటుందామె. అయితే అంత బిజీ షెడ్యూల్ మధ్య కూడా అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కనిపిస్తుంటుంది. భారీగా ముట్టజెబుతున్నారనో.. లేక టాలీవుడ్ చలవతోనే హీరోయిన్ గా మారాననే కృతజ్ఞతతోనే.. మొత్తానికి హన్సిక అయితే తెలుగుచిత్రసీమను వదలట్లేదు. తను కూడా ఉన్నానంటూ ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తుంటుంది. పవర్ లో రవితేజ సరసన మెరిసిన ఈ చిన్నది, ఇప్పుడు మరో సినిమా చేసేందుకు ఒప్పుకుంది. తమిళ్ లో హిట్టయిన మాన్ కరాటే సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నారా రోహిత్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సికను తీసుకున్నారు. మాన్ కరాటె తమిళ వెర్షన్ లో కూడా హన్సికనే హీరోయిన్ గా నటించింది. గుండెల్లో గోదారి లాంటి సెన్సిబుల్ సినిమాని తెరకెక్కించిన కుమార్ నాగేంద్ర, ఈ రీమేక్ సినిమాని హ్యాండిల్ చేస్తున్నాడు. జిల్ తో విలన్ గా మంచి మార్కులు తెచ్చుకున్న కబీర్ దుహన్ సింగ్.. ఈ సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. పవర్ తో హిట్ అందుకున్న గోల్డెన్ హ్యాండ్ హన్సిక.. ఈ రీమేక్ తో కూడా మరో సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.