మోసగాళ్లకు మోసగాడని సుధీర్ అనిపించుకు‍ంటాడా ?

కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన సుధీర్ బాబు సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అనుకోకుండా వచ్చిన ప్రేమకథాచిత్రమ్ విజయం తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు సుధీర్. ఈసారి ఏకంగా కృష్ణ నటించిన సూపర్ హిట్ టైటిల్ తోనే మరోసారి మనముందుకొస్తున్నాడు. అదే మోసగాళ్లకు మోసగాడు. పూర్తిగా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆడియోను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ఆడియో ఫంక్షన్ కు ఎప్పట్లానే కృష్ణ-విజయనిర్మల అతిధులుగా హాజరయ్యారు. ఇండస్ట్రీ నుంచి దాసరి నారాయణరావు,శ్రీకాంత్, పాలిటిక్స్ నుంచి బొత్స సత్యనారాయణ కూడా ఆడియో వేడుకకు వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సుధీర్ బాబు, నందిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బోస్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తారు. పరిశ్రమకొచ్చి 50ఏళ్లు పూర్తిచేసుకున్న సూపర్ స్టార్ కృష్ణకు ఇదే వేదికపై సన్మానం కూడా జరిగింది.