ఎమో పెళ్ళి ఎప్పుడైనా జరగవచ్చు.. కత్రీనా

బాలీవుడ్ లో కత్రినాకైఫ్-రణబీర్ కపూర్ ప్రేమించుకుంటున్నారనేది ఓపెన్ సీక్రెట్. వాళ్లిద్దరూ ఎక్కడా ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేయనప్పటికీ అక్కడి ఆల్ ఇండియా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఇది. దీంతో ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం రాలేదు ఈ జంటకి. అందరూ చర్చించుకోవడంతో పాటు ఈ జంటే స్వయంగా చాలా సందర్భాల్లో కెమెరాకి దొరికిపోయింది కూడా. దీంతో రణబీర్-కత్రిన ప్రేమించుకుంటున్నారనే వార్త కంటే పెళ్లెప్పుడు చేసుకుంటారనే వార్తకే ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ వార్తలకు తగ్గట్టే ఈ జంట కూడా ప్రేమ విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినప్పటికీ పెళ్లి గురించి టీజర్లు వదులుతున్నారు. 
తాజాగా కత్రినాకైఫ్, రణబీర్ కుటుంబ సభ్యులతో కలిసి స్పెషల్ డిన్నర్ కు వెళ్లింది. ఆ డిన్నర్ లో రణబీర్ లేకపోయినప్పటికీ అతడి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ డిన్నర్ లో పెళ్లికి సంబంధించిన విషయాలే మాట్లాడుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని విలేకరులు ప్రశ్నిస్తే త్వరలోనే చెబుతానంటూ తప్పించుకుంది పొడుగుకాళ్ల సుందరి. మరోవైపు తన పెళ్లికి సంబంధించి తాజాగా మరో టీజర్ రిలీజ్ చేసింది కత్రిన. ఈ ఏడాది పెళ్లి ఉంటుందా అనే ప్రశ్నకు ఏమో.. ఏదైనా జరగొచ్చంటూ నవ్వుతూ వెళ్లిపోయింది.